PAVITRA SAMARPANA HELD AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

TIRUPATI, 19 SEPTEMBER 2021: Pavitra Samarpana held with religious fervour in Tiruchanoor temple on Sunday.

 

As part of annual Pavitrotsavams festivities, Pavitra Malas were decked to the main deity of Sri Padmavathi Ammavaru, Utsava Murthies, Parivara deities, Vimana Prakaram, Dhwajam Sthambham etc.

 

Vaidika programs will be performed in the evening in Yagashala.

 

JEO Smt Sada Bhargavi, temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others were present. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

 తిరుపతి 2021 సెప్టెంబర్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా, సాయంత్ర 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.

ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు
శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.