TTD BOARD MEMBER TAKES OATH _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ ప్రమాణస్వీకారం

Tirumala, 19 September 2021: The newly appointed TTD board member Sri Tangaturi Maruti Prasad took oath at Srivari Temple on Sunday morning.

TTD Additional EO Sri AV Dharma Reddy served the oath of office to Sri Maruti Prasad at Bangaru Vakili location in the Srivari temple.

Later the new TTD board member was rendered Veda Ashirwachanam by TTD Vedic pundits and the Additional EO presented Srivari thirtha Prasadam, portrait of Srivaru and a coffee table book to him.

Srivari temple DyEO Sri Ramesh Babu, DyEO (General) Smt Sudha Rani, Peishkar Sri Hari and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 19: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ మారుతిప్రసాద్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.
       
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) శ్రీమతి సుధారాణి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.