PEDDA SESHA VAHANAM _ పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

CULTURAL PANORAMA AT SKVST BRAHMOTSAVAMS

Srinivasa Mangapuram, 14 Feb. 20: On the first day evening of the nine day annual brahmotsavams which commenced at Srinivasa Mangapuram on Friday, Sri Kalyana Venkateswara Swamy with His two consorts graced on Pedda Sesha Vahanam.

The utsava deities marched along the streets surrounding the temple and the devotees chanted Govinda…Govinda…with religious ecstasy. 

Cultural programs entertain the devotees at Srinivasa Mangapuram on Friday evening.

DyEO Sri Elleppa, Suptd Sri Chengalrayulu, Temple Inspector Sri Anil, other officials, devotees were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 14 : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షిచారు.  

బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.
       

ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యుడు,  సూరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.