HAMSA VAHANAM ENCHANTS DEVOTEES _ హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం

Tirupati, 14 Feb. 20: On the first day evening, the utsava deities of Sri Somaskanda Murty and Goddess Kamakshi Devi glided on Hamasa carrier on Friday evening as a part of the ongoing annual brahmotsavams at Kapileswara swamy temple in Tirupati. 

The bhajan and cultural troupes added the enhanced majesty to the procession. 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple Inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik and other office staff were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం
 
ఫిబ్రవరి 14, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. శ్రీ కామాక్షి అమ్మవారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
 
ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.