POURNAMI GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 19 NOVEMBER 2021: On the auspicious occasion of Karthika Pournami, Garuda Seva was observed in Tirumala on Friday evening.

 

In all His divine splendour, Sri Malayappa Swamy shined brightly on the mammoth Garuda Vahanam to bless His devotees.

 

Temple officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 19: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై వాహన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.