KARTHIKA DEEPAM AT SRI KT _ శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

TIRUPATI, 19 NOVEMBER 2021: In the advent of Krithika star, Karthika Deepotsavam was observed in Sri Kapileswara Swamy temple on Friday night.

 

JEO Sri Veerabrahmam participated in this important religious event. The auspicious Deeparadyana was held on the Gopuram of Kapileswara, Kamakshi Ammavaru and on Dhwajasthambham.

 

In Unjal Mandapam, the ghee lit lamps were arranged in the shape of Sivalingam, Trishulam and Jwala Thoranam performed.

 

Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
 
తిరుపతి, 2021, న‌వంబ‌రు 19: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం  సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. 
 
కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయి.
 
సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 
 
ఈ కార్యక్రమంలో  టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం  ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, శ్రీ శ్రీనివాస నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.