POURNAMI GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 06 APRIL 2023: On the auspicious day of Phalguna Pournami, Sri Malayappa Swamy blessed His devotees on the mighty Garuda Vahanam along four mada streets in Tirumala.

The pleasant evening on Thursday witnessed the mega religious parade between 7pm and 9pm.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2023 ఏప్రిల్ 06: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.