POURNAMI GARUDA SEVA HELD IN TIRUMALA _ శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 27 Feb. 21The monthly Pournami Garuda Seva was held in Tirumala on Saturday evening.

Devotees thronged in large numbers to witness the procession of Sri Malayappa Swamy on the mighty Garuda Vahanam and blessed the devotees between 7pm and 9pm.

TTD Board Members Dr Nichitha, Sri Chippagiri Prasad, Smt G Vani Mohan- Prl Secretary to Government of AP (Revenue), Spl Invitees Sri Dusmantha Kumar Das were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2021 ఫిబ్రవరి 27: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది.

రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా. వాణి మోహన్, బోర్డు సభ్యులు డా. నిశ్చిత, శ్రీ సి.ప్రసాద్, శ్రీ దుష్మంత్ కుమార్ దాస్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.