MAGHA PURNIMA SNANAM GOES OFF WELL IN TRIVENI SANGAMAM _ కాళేశ్వ‌రం త్రివేణిసంగ‌మంలో ఘనంగా మాఘపూర్ణిమ స్నానం

Tirupati, 27 Feb 2021: The auspicious Magha Pournami Punya Snanam was observed with religious fervour in the Triveni Sangamam at Kaleshwaram on Saturday.

As part of the Magha Masa festivities mulled by TTD, the sacred bath was planned at the Jayashankar Bhupalpally district of Telangana State. The programme was telecasted live on SVBC between 9am and 11am.

Earlier, the processional deities of Srivaru with Sridevi and Bhudevi along with Chakrattalwar were brought to the banks of the river and Snapana Tirumanjanam was performed. Later the holy Disc was given celestial dip.

Kaleshwaram is famous as Dakshina Kasi and three rivers including the Godavari, Pranahita and Saraswathi merge to form Triveni Sangamam. On the banks of this river triplet is located the famous Sri Kaleshwara Mukteswara Swamy temple.

District Collector Sri Krishna Aditya, SP Sri Sangram Singh Patil, SVBC CEO Sri Suresh Kumar, Tirumala temple OSD Sri P Seshadri were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాళేశ్వ‌రం త్రివేణిసంగ‌మంలో ఘనంగా మాఘపూర్ణిమ స్నానం

తిరుమ‌ల‌, 2021 ఫిబ్రవరి 27: టిటిడి త‌ల‌పెట్టిన మాఘమాస‌ మ‌హోత్స‌వంలో భాగంగా మాఘపూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకుని శనివారం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రంలోని త్రివేణి సంగ‌మంలో మాఘపూర్ణిమ పుణ్య‌స్నానం కార్య‌క్ర‌మం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని కొలువుదీర్చి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో వేడుకగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వహించారు. ఆ త‌రువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు చ‌క్ర‌స్నానం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ద‌క్షిణ కాశీగా ప్ర‌సిద్ధి చెందిన కాళేశ్వ‌రంలో గోదావ‌రి, ప్రాణ‌హిత‌, అంత‌ర్లీనంగా స‌ర‌స్వ‌తి న‌దులు ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ మూడు న‌దుల సంగ‌మ స్థాన‌మైన శ్రీ కాళేశ్వ‌ర ముక్తేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, ఎస్పీ శ్రీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ జి.సురేష్ కుమార్, శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.