PRANAYA KALAHOTSAVAM OBSERVED _ తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం

Tirumala, 30 Dec. 20: The unique festival, Pranaya Kalahotsavam was observed with pomp and gaiety in Tirumala on Wednesday evening.

This festival also known as ‘Sriya Samvadam’, meaning dialogue between Lord and His consorts is usually observed on the 17th day of Adhyayanotsavams at Tirumala in the auspicious month of the Dhanurmasam.

As part of the festival the processional deities of Lord Malayappa and His two consorts were taken around the mada streets in a grand procession on their respective golden palanquins in opposite directions.

When the two processions come face-to-face at the north-east corner of the temple, opposite Swamy Pushkarini, the temple priests symbolically enact the Divine Love Game-‘Pranaya Kalahotsavam’ much to the amusement of the devotees.

A group of priests take the side of Lord and while another support Goddesses and enact the love game. Adding more colours, the two consorts threw flower balls at the Lord who in turn duck to escape the floral attacks of His spouses, giving lighter moment to the pilgrims.

The priests recited ‘pasurams’ from the Alwar Divya Prabandham penned by Sri Nammalwar in Ninda Stuthi style (form of praising Lord with apparent criticisms), which is unique to this festival alone. This religious event concludes finally with the Lord pacifying His two consorts putting all His endeavours and returns to the temple.

Both the Tirumala Pontiffs, temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం

తిరుమల, 2020 డిసెంబరు 30: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీపై మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీలపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చారు. దివ్యప్రబంధ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి, ఎవిఎస్వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.