JEO INSPECTS TTD EDUCATIONAL INSTITUTIONS _ టిటిడి కళాశాలలను తనిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 30 Dec. 20: TTD JEO for Health and Education Smt Sada Bhargavi inspected TTD colleges to verify how covid guidelines are being followed in these educational institutions on Wednesday in Tirupati.
As part of inspection, she visited SV Arts College, SGS Arts College, SV College of Music and Dance. She instructed the Principals of the concerned colleges, to learn their students Annapoorneshwari Devi sloka and Bhagavad Gita. She also said, the records of all pupils be computerised in co-ordination with IT wing of TTD.
The JEO later directed the engineering officials to complete the pending works in all colleges in a speedy manner.
Deputy EO Education Sri Govindarajan, EEs Sri Krishna Reddy, Smt Sumati, Principals of respective colleges were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి కళాశాలలను తనిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 డిసెంబర్ 30: తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ సంగీత నృత్య కళాశాలలను జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు .
ఈ సందర్భంగా జెఈవో టిటిడి విద్యాసంస్థల్లో కోవిడ్-19 మార్గదర్శకాల అమలు తీరును, పాఠ్యాంశాల బోధన పరిశీలించి పలు సూచనలు చేశారు. కళాశాలలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగుజాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
టిటిడి కళాశాలలోని విద్యార్థులకు భగవద్గీత, అన్నపూర్ణేశ్వరి శ్లోకాలను నేర్పించాలన్నారు. టిటిడి ఐటి విభాగంతో సమన్వయం చేసుకుని విద్యార్థుల రికార్డులు భద్రపరచాలన్నారు. టిటిడి కళాశాలకు నాక్ గుర్తింపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. కళాశాలలో అవసరమైన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జెఈవో వెంట టిటిడి డెప్యూటీ ఈవో (విద్య) శ్రీ గోవిందరాజన్, ఇఇలు శ్రీమతి సుమతి, శ్రీ కృష్ణారెడ్డి ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.