RATHOTSAVAM HELD _ వైభ‌వంగా శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ర‌థోత్స‌వం

TIRUPATI, 27 MARCH 2023: On a penultimate day on Monday, Rathotsavam was observed with grandeur as part of the ongoing annual brahmotsavams in Sri Kodandaramalayam in Tirupati.

On the eighth day, Sri Kodandarama atop the massive wooden chariot blessed His devotees who converged all along the mada streets of the temple city surrounding the temple.

Both the senior and junior pontiffs of Tirumala, CE Sri Nageswara Rao, EEs Sri Krishna Reddy, Sri Venugopal, Sri Sivarama Krishna, Sri Muralikrishna, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Superintendent Sri Ramesh and other officials were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
 
తిరుపతి,2023 మార్చి 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.45 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.
 
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.
 
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి  నాగరత్న, ఈఈలు శ్రీ వేణుగోపాల్, శ్రీ శివరామకృష్ణ, శ్రీ మురళీకృష్ణ, శ్రీ కృష్ణారెడ్డి, డిఈ (ఎలక్ట్రికల్) శ్రీ చంద్రశేఖర్, ఏఈఓ శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
మార్చి 28న చక్రస్నానం
 
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.