SAM”MOHINI” AVATARA OF UNIVERSAL GODDESS MESMERIZES DEVOTEES

Tiruchanur, 19 November 2017: Divine Mother Goddess Padmavathi Devi mesmerized devotees with Her enchanting beauty in Mohini Avatara on Pallaki Utsavam on fifth day morning of the ongoing annual brahmotsavams at Tiruchanoor.
The beauty and elegance of Goddess Padamavathi Devi is Universal and beyond any description. Her beauty enhanced when she donned the Avatar of Universal Damsel, Mohini on bright sunny day on Sunday.

Majestically seated on a finely decked floral palanquin, draped in rich silk attires, dazzling diamond studded golden jewels, with a golden parrot sitting on her right shoulder and a mirror placed in Her front, the divine mother blessed devotees.

Hundreds of devotees took part in this celestial procession


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పల్లకీలో మోహిని అవతారంలో శ్రీ పద్మావతి అమ్మవారు విహారం

తిరుపతి, 19 నవంబరు 2017; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడా వీధుల్లో విహరించారు. ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు ఈ ఉత్సవం సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

ఈసందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఆదివారం ఉదయం అమ్మవారు పల్లకీలో మోహిని అవతారంలో భక్తులకు దర్శమిచినట్లు తెలిపారు. రాత్రి 8.00 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులను కటాక్షించనున్నట్లు వివరించారు. గజం ఐశ్వర్యసూచక కావున అటువంటి గజవాహనంపై అమ్మవారిని దర్శిస్తే అనంతైశ్వర్యం, శత్రు నాశనం కలుగుతుందన్నారు.

అనంతరం సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ మాట్లాడుతూ గజవానానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, వి.జి.వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీరాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారథిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.