CULTURAL BONANZA OF SRI PAT BRAMHOTSAVAMS

Tirupati , 18 November 2017:The cultural programs including bhakti sangeet, discourses and dances etc organised by the HDPP wing of TTD captivating the cultural buffs of temple town.

As part of the agenda the artistes of SV college of Music and Dance rendered Mangaladwani and students of Sri Venkateswara Veda Pathasala presented Veda parayanams at the Asthana mandapam of Sri Padmavati Ammavari temple,Tiruchanoor
on Saturday.

Later the Hyderabad based Smt Mukthevi Bharati presented a discourse followed by Smt T Ammaji of Vizianagaram presented Bhakti sangeet.This was followed by Harikatha anchored by Sri Burra Padmanabha Sharma of Vijayawada and Annamaiyya Vinnapalu at the Unjal seva by Smt B Lalitha Madhavi team of Chennai.

Similarly at the Mahati Kalakshetram instrumental sangeet was rendered by the Chennai based Sri Kadapa Raghavendra team.At Annamacharya Kala mandir the Hyd team of Sri Vijayasai Bhargav presented Bhakti sangeet.

At night the Dr Vedantam Ramalinga Shastri team presented Kuchinapudi group dance .At the Shilparamam on Srikalahasti Road, the Smt Yashodamma team of Tirupati presented a dance program to enthrall the art lovers of temple town.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి సాంస్కృతిక శోభ

తిరుపతి, 18 నవంబరు 2017; శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తిరుచానురులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు
హైదరాబాదుకు చెందిన శ్రీమతి ముక్తేవి భారతి గారిచే ధార్మికోపన్యాసం, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజయనగరంకు చెందిన శ్రీమతి టి.అమ్మాజి బృందం భక్తి సంగీత కార్యక్రమాలు జరిగింది.

అనంతరం విజయవాడకు చెందిన శ్రీబుర్ర పద్మనాభశర్మ బృందంచే మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు హరికథ, సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు చెన్నైకు చెందిన బి.లలితా మాధవి బృందంచే అన్నమయ్య విన్నపాలు, ఊంజల్‌ సేవలో సంకీర్తనాలాపన నిర్వహించనున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకిి చెందిన శ్రీ కడప రాఘవేంద్రన్‌ బృందంచే వాద్య సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీవి.విజయసాయి భార్గవ్‌ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు కూచిపూడికి చెందిన డా|| వేదాంతం రామలింగశాస్త్రి బృందం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జి.యశోదమ్మ బృందంచే నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.