LAKSHMI KASULA HARAM REACHES TIRUCHANOOR FROM TIRUMALA_ అమ్మవారికి వైభవంగా ”లక్ష్మీ కాసులహారం” సమర్పణ

Tiruchanur, 19 November 2017:The famous Lakshmi Kasula Haram has reached Tiruchanoor from Tirumala on Sunday Morning.

This five stepped massive jewel which is usually decorated to Lord Malayappa Swamy in Tirumala during Pournami Garuda Seva will be decorated to Goddess Padmavathi during Gaja Vahanam on Sunday evening.

Tirumala temple DyEO Sri Kodanda Rama Rao handed over this jewel to Tirupati JEO Sri P Bhaskar at Pasupu Mandapam near Shilparamam. From there the Jewel was carried to the temple in Tiruchanoor as shobha yatra.

Tiruchanoor temple spl.gr.DyEO Sri P Muniratnam Reddy, VGO Sri Ashok Kumar Goud and other officials were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారికి వైభవంగా ”లక్ష్మీ కాసులహారం” సమర్పణ

తిరుపతి, 19 నవంబరు 2017 ; తిరుమల శ్రీవారికి ప్రతి పౌర్ణమి గరుడసేవ రోజున అలంకరించే ”లక్ష్మీ కాసులహారాన్ని” ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. ఉదయం 9.00 గంటలకు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి కలిసి తిరుమలలో కాసులహారం ఊరేగింపును ప్రారంభించారు. ఉదయం 11.00 గంటలకు ఈ హారం తిరుచానూరులోని అర్బన్‌హట్‌ (శిల్పరామం) వద్దకు తీసుకొచ్చి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌కు అందజేశారు.

అనంతరం కాసులహారానికి తిరుచానూరులోని పసుపుమండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా ఆలయ మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ లక్ష్మీ కాసులహారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి అలంకరించనున్నట్లు తెలిపారు. భక్తులకు సంతృప్తి కరంగా అమ్మవారి వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకునేల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, వి.జి.వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీరాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారథిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గజవాహనంపై అమ్మవారు కనువిందు: