SARVABHOOPALA VAHANAM HELD _ సర్వభూపాల వాహనంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి అభయం

TIRUPATI, 13 JUNE 2022: As a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta, Sarvabhoopala Vahanam is held on Monday evening.

Earlier in the evening, arjita Kalyanotsavam was held.

AP Minister Smt RK Roja, Deputy EO Sri Lokanatham, DE Sri Chandrasekhar,  Superintendent Smt Srivani and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి అభయం
 
తిరుపతి, 2022 జూన్‌ 13: అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు  సర్వభూపాల వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.
 
మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. సాయంత్రం జరిగిన కల్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి రోజా పాల్గొన్నారు.
 
ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీనివాసుడు  కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకులు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.
 
కాగా, సాయంత్రం ఆర్జిత కల్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.