TEPPOTSAVAMS ENTERS DAY 4 _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

TIRUPATI, 13 JUNE 2022: On the fourth day of ongoing annual Teppotsavams, Goddess Padmavati Took five rounds on the finely decked float on Monday evening in Padma Sarovaram.

 

Temple DyEO Sri Lokanatham, EE Narasimha Murty and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
 
తిరుపతి, 2022 జూన్‌ 13: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, ఇఇ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి,  డెప్యూటీ ఇఇ శ్రీ సురేష్ బాబు, ఏఇ శ్రీ సురేష్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఏఇ శ్రీ మురళీకృష్ణ, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.