SITA RAMA KALYANAM HELD _ నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం

TIRUPATI, 31 MARCH 2023: On a pleasant evening on Friday, Sri Sita Rama Kalyanam was held with religious fervour at Sri Kodandarama Swamy temple in Tirupati.

The event includes Ankurarpanam, Viswaksena Aradhana, Raksha Bandhanam, Agni Pratista Maha Sankalpam, Purnahuti, Akshatarohanam, Mutyala Talambralu samarpana, Chaturveda Parayanam, Harati.

Earlier during the day the procession of Mutyala Talambralu took place in a grand manner from TTD Administrative Building to the temple. DyEOs Sri Govindarajan, Smt Nagaratna and other employees participated.

TTD Trust Board member Sri Ashok Kumar, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Superintendent Sri Ramesh Kumar, temple staffs, Archakas, devotees participated in Kalyanam.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం
 
 తిరుప‌తి, 2023 మార్చి 31: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ‌ సీతారాముల కల్యాణం నేత్ర‌ప‌ర్వంగా  జరిగింది. 
 
సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.
 
ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు :
 
శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టీటీడీ  పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా వాటిని ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఆలయ డెప్యూటీ  ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్,  సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది