SRI RAMA PATTABHISHEKAM HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirumala, 31 MARCH 2023: The celestial Sri Rama Pattabhisheka Astanam was held in Tirumala temple on Friday evening.

The Pattabhisheka episode from Srimad Ramayanam was read out by Veda pundits during Astanam at Bangaru Vakili in front of utsava deities of Sri Sita Lakshmana Anjaneya sameta Sri Rama Chandra Murty.

TTD officials were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2023 మార్చి 31: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు విశేష సమ‌ర్ప‌ణ చేప‌ట్టారు. సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు.

రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంత‌రం సుగ్రీవుడు, అంగ‌దుడు ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి వారితోపాటు ఆంజ‌నేయ‌స్వామివారికి పుష్ప‌మాల‌లు స‌మ‌ర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.