SITA RAMA KALYANAM IN A BIG WAY ON APRIL 15 _ కోదండ రాముడి కల్యాణం విజయవంతం చేయాలి

PRELIMINARY REVIEW HELD

 

FINAL MEETING ON APRIL 9

 

VONTIMITTA, 05 APRIL 2022: Elaborate arrangements for the celestial statfestival of Sri Sita Rama Kalyanam on April 15 are underway said TTD Additional EO Sri AV Dharma Reddy.

 

As the state festival of Sri Sita Rama Kalyanam is being conducted after a gap of two years due to Corona Pandemic, TTD in co-ordination with the Kadapa district administration is doing the preparations for the big festival.

 

Speaking to media after the inspection of the temple, dormitories, VIP rest house, Kalyana Vedika etc. and a review meeting, TTD Additional EO along with YSR Kadapa District Collector Sri Vijayaramaraju said, as the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy is going to take part in the celestial Kalyanam on April 15, the status of preparatory works for the mega fete is being discussed.

 

He said, “Today we had a preliminary meeting with the local district administration on the arrangements to be made and a final review meeting with all the departments will be convened on April 9.

 

JC Saikanth Verma, Asst. Collector Sri Babu, Additional SP Sri Mahesh Kumar, TTD CE Sri Nageswara Rao and other department heads from TTD, district administration were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోదండ రాముడి కల్యాణం విజయవంతం చేయాలి

– టీటీడీ, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలి

– ఒంటిమిట్ట లో రాములవారి కల్యాణం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి

తిరుపతి 5 ఏప్రిల్ 2022: ఏప్రిల్ 9వ తేదీ నుంచి నిర్వహించే ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ జరిగే శ్రీ కోదండరామ స్వామి వారి ఈ వేడుకను టిటిడి జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేయాలని టిటిడి ఆదనపు కార్యనిర్వహణ అధికారి శ్రీ AV. ధర్మారెడ్డి అధికారులకు సూచించారు

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. కళ్యాణ వేదిక కోసం ఏర్పాటు చేసిన టికెట్లు ప్రసాదాల పంపిణీ పాయింట్లు పార్కింగ్ ,భద్రత కు సంబంధించిన ఏర్పాట్లను కళ్యాణ వేదిక మైదానంలో పరిశీలించారు ఏర్పాటుపై టిటిడి అధికారులకు సూచనలు చేశారు కళ్యాణ వేదిక పై మంత్రులు ఇతర వీఐపీల కోసం ఏర్పాట్లు ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కోసం సిద్ధం చేసిన గది, అతిథి గృహం లోని ఇతర గదులు పరిశీలించారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు తో కలసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, స్వామివారి కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేశారని చెప్పారు. ఈ సంఖ్య పెరిగేలా ఉంటే ముందుగా చెబితే అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. టీటీడీ, పోలీసు, రెవిన్యూ, ప్రజారోగ్యం ఇతర శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలన్నారు. ప్రతి గ్యాలరీలో పోలీసు సిబ్బంది ఉండి తొక్కిసలాట జరక్కుండా చూడాలన్నారు. కళ్యాణం ముగిశాక భక్తులు ఒక్కసారిగా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. వి ఐ పి లు ఇతరుల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కళ్యాణ వేదిక ప్రాంతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. వైర్ లెస్ సెట్లు తగినన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో అనవసర వస్తువులు ఉండరాదని, డాగ్ స్క్వాడ్ తో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించాలని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీ పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ, బద్వేలు ఆర్డీవో శ్రీ ఆకుల వెంకట రమణ, అదనపు ఎస్పీ శ్రీ మహేష్ కుమార్, టీటీడీ సి ఈ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్, వి జి ఓ శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది