SURYAPRABHA VAHANA SEVA HELD _ సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

TIRUPATI, 04 APRIL 2022: On the Seventh day morning in bright sunny day, Suryaprabha Vahana Seva was held in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Tuesday.

 

As a part of ongoing annual brahmotsavam in Sri Kodanda Ramaswamy temple in Tirupati, Sri Rama took celestial ride on the vahanam.

 

Both the Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis of Tirumala, Spl Gr DyEO Smt Parvati, AEO Durgaraju, Kankanabhattar Sri Ananda Kumar Deekshitulu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

తిరుపతి, 2022 ఏప్రిల్ 05: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే  ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం.

వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వేడుకగా నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.