SNAPANAM PERFORMED _ శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

Tiruchanoor, 12 Nov. 20: The colourful Snapana Tirumanjanam was performed on the second day to Goddess Sri Padmavathi Devi at Tiruchanoor on Thursday.

On the day two of ongoing annual brahmotsavams, the  special abhishekam with Ksheera(milk), Dadhi(curd), Madi(honey), Narikelam(coconut water), Haridrodakamturmeric water), Gandhodakam (Sandalwater) was performed to Ammavaru at Sri Krishna Mukha Mandapam.

Shankhadhara, Chakradhara, Sahasradhara, Mahakumbhabhishekam were performed chanting hymns from Taittiriya Upanishad, Purushasooktam, Sri Prasna Samhita.

The special garlands decked to Goddess during Snapana Tirumanjanam included Cuscus, Sweetcorn, Anjeer, Apricot, Roses, Pineapple and Tulsi.

JEO Sri P Basant Kumar, DyEO Smt Jhansi Rani were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

తిరుపతి, 2020 నవంబరు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన గురువారం అమ్మవారికి నిర్వహించిన‌ స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

కంకణభట్టార్‌ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో వట్టివేరు పూస‌లు, స్వీట్‌కార్న్‌, ఆప్రికాట్‌, రోజా, అంజూరా, పైనాపిల్ మ‌రియు డ్రైఫ్రూట్స్‌, తుల‌సి మాల‌లు, కిరీటాలు అమ్మవారికి అలంకరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.