SRI GT GOLD PLATING WORKS COMPLETES BY NEXT YEAR MID- TTD CHAIRMAN _ వచ్చే ఏడాది మే నాటికి బంగారు తాపడం పనులు పూర్తి : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

BALALAYA SAMPROKSHANA HELD AT SRI GT

 

Tirupati, 13 Sep. 21:  TTD Chairman Sri YV Subba Reddy on Monday said that the gold plating works of Sri Govindaraja Swamy temple vimana will be completed by mid of 2022.

 

Participating in the concluding event of five day long Balalaya program which began on September 9 and concluded on September 13 with Samprokshana fete at the temple premises, the TTD Chairman said the Sri GT Gopuram was completed in1972 and the TTD board decided to take up gold plating works in 2018.

 

He said the entire gold plating will cost Rs.32 crores and is comprised of 100 kgs of gold and 4300 kgs of copper plates. However, all the Nitya Kainkaryams for Mula murti will continue uninterrupted at the Balalaya organised at the Kalyana Mandapam in the temple.

 

Earlier the vaidika programs of Purnahuti, Divya Prabandam Sattumora were conducted followed by Balalaya Samprokshana. Later in the afternoon Nityakatla Kainkaryams and in the evening, the vaidika activities will be observed at the Yagashala.

 

Tirupati MLA Sri Bhumana Karunakar Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Nageswara Rao, FA&CAO Sri O Balaji, Temple Special Grade DyEO Sri Rajendrudu, Temple Chief Archaka Sri P Srinivasa Dikshitulu, Agama Advisor Sri Vedanta Vishnu Bhattacharya and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వచ్చే ఏడాది మే నాటికి బంగారు తాపడం పనులు పూర్తి : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో సెప్టెంబ‌రు 9వ తేదీ నుండి జరుగుతున్న బాలాల‌య కార్యక్రమాలు సోమవారం సంప్రోక్ష‌ణంతో ముగిశాయి.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ 1972వ సంవత్సరంలో ఆలయ విమాన గోపురం పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో టిటిడి బోర్డు నిర్ణయించిందని చెప్పారు. రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, ఇందుకోసం 100 కిలోల బంగారం, 4300 కిలోల రాగి వినియోగిస్తున్నామని వివరించారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యధావిధిగా ఉంటుందని, కైంకర్యాలన్నీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తారని తెలియజేశారు.

అంతకుముందు ఉద‌యం యాగ‌శాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, దివ్య‌ప్ర‌బంధ శాత్తుమొర నిర్వ‌హించారు. అనంతరం బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌ట్టారు. మ‌ధ్యాహ్నం నిత్య‌క‌ట్ల కైంక‌ర్యం, సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, విఎస్వో శ్రీ మనోహర్, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.