SRI KRISHNA RUKMINI TAKE PLEASURE RIDE _ తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Tirumala, 14 Mar. 22: On the second day evening as part of ongoing Teppotsavams in Tirumala, Sri Krishna Swamy accompanied by Rukmini blessed pilgrims on the finely decked float.

Every inch of the steps surrounding Swamy Pushkarini was occupied by devotees chanting Govinda… Govinda out of devotion.

The deities took pleasure ride all along the sacred waters and cheered the devotees who thronged to witness the fete in the pleasant evening on Monday.

HH Tirumala Sri Chinna Jeeyar Swamy and TTD officials including SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, Temple Peishkar Sri Srihari were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల, 2022 మార్చి 14: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వేదం, గానం, నాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.

కాగా, మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.