DIVINE WEDDING CEREMONY ENTHRALLS DEVOTEES _ వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

TIRUMALA, 30 APRIL 2023:  Amidst the rhythmic vedic chants, soulful Nadaswaram, melodious rendition of Annamacharya Sankeertans, the divine wedding ceremony of Sri Padmavathi Pariyanotsavam was observed with utmost religious fervour in Tirumala on Sunday.

 

Earlier the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi entered the finely decked Parinayotsava Mandapam on Aswa Vahanam and Tiruchis separately.

 

After observing Edurkolu, Varana Mayiram, Poobantata and other Hindu marriage traditions, the deities were seated on the tastefully decorated swing in Parinayotsava Mandapam located in Narayanagiri Gardens.

 

The entire premises echoed to the divine chants of Chaturveda Parayanam.

 

After Mantra Pushpam Sourastra, Desika, Malhari, Yamuna Kalyani, Kalyani, Ananda Bhairavi, Neelambari Ragaas were rendered on Nada Swaram followed by Tala Vaidya, Dhamarukam, Tiruchi Vaidya and concluded with the Sarva Vaidyam.

 

The Harikatha Parayanam on Padmavathi Srinivasa Parinayam by renowned Harikatha Bhagavatar Sri Venkateswarulu impressed the devotees.

 

TTD has cancelled Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva owing to the celestial fete on Sunday.

 

Deputy EO Sri Lokanatham, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Garden Deputy Director Sri Srinivasulu, VGO Sri Bali Reddy and other officials, huge number of devotees were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమల, 2023 ఏప్రిల్ 30: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి.

పరిణయోత్సవంలో రెండవ రోజైన ఆదివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ తిరుచ్చి లలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు.

ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, సౌరాష్ట్ర రాగం, దేసిక, మలహరి, యమునా కళ్యాణి, ఆనంద భైరవి నీలాంబరి రాగాలు, వివిధ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. తరువాత అన్నమాచార్య సంకీర్తనలతో ప్రాంగణం అంతా మారుమోగింది. ప్రముఖ హరికథా భాగవతార్ శ్రీ వేంకటేశ్వరులు పద్మావతి శ్రీనివాస పరిణయంపై హరికథా పారాయణం భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఆ తరువాత శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది.

డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, గార్డెన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, వీజీవో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.