COMPLETE PAEDIATRIC HOSPITAL WORKS BY JULY 20-TTD EO _ 20వ తేదీలోపు పనులు పూర్తి కావాలి – చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించిన టీటీడీ ఈవో

Tirupati, 7 Jul. 21: TTD EO Dr KS Jawahar Reddy instructed the Engineering Officials to complete the new building construction for Children’s Hospital in BIRRD Hospital premises before July 20.

During an inspection held on Wednesday evening, the EO visited the three operation theatres, OP, ICU, General Wards, Labs, Administrative office under construction in the hospital along with CE Sri Nageswara Rao. He also enquired on the procurement of hospital machinery. He instructed the officials to speed up the works and complete them before July 20.

SEs Sri Jagadishwar Reddy, Sri Venkateswarulu, BIRRD Special Officer Dr Reddeppa Reddy, CSRMO Sri Seshasailendra were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

20వ తేదీలోపు పనులు పూర్తి కావాలి
– చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి 7 జూలై 2021: బర్ద్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు జూలై 20 వ తేదీలోపు పూర్తి కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలించారు.

ఆసుపత్రిలో నిర్మిస్తున్న మూడు ఆపరేషన్ థియేటర్లు, ఓపి, ఐసీయూ, జనరల్ వార్డులు, ల్యాబ్, పరిపాలనా విభాగాల నిర్మాణం పనులను ఆయన చూశారు. పనుల వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, ఫర్నీచర్, ఇతర మిషనరీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు ఇసుక ఇబ్బంది ఉందా అని ఆరా తీశారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీ జగదీశ్వరరెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, బర్ద్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ ఆర్ఎమ్ఓ శ్రీ శేష శైలేంద్ర తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది