TEPPOTSAVAMS COMMENCES IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 01 JANUARY 2023: The annual Teppotsavams commenced on a grand religious note in Sri Kapileswara Swamy temple on Sunday.

On the first day evening Sri Vinayaka Swamy along with Sri Chandra Sekhara Swamy took out a celestial ride on the finely decked float in the sacred waters of the temple tank.

DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi and other staff, a large number of devotees were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం
 
తిరుపతి, 01 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
అదేవిధంగా రెండవ రోజు శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు,మూడోరోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదోరోజు శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.