TTD CHAIRMAN BEGINS ANNAPRASADAM DISTRIBUTION CENTRE AT PAC -4 _ అన్న ప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
Tirumala,01 January 2023: TTD Chairman Sri YV Subba Reddy on Sunday inaugurated the Annaprasadam Centre at (old Annaprasadam complex), later served and interacted acted with devotees who expressed immense pleasure over the arrangement of one more Annaprasadam.
Later speaking to media persons, the TTD Chairman said the TTD board had decided to open mini Anna Prasadam Bhavan on all four regions of Tirumala to facilitate devotees as the crowd numbers had surged at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex.
ABOUT SSD TOKENS
Responding to a question the TTD Chairman said that SSD tokens issuance to devotees for Vaikunta Dwara Darshan has commenced and as of 6.00 pm of Sunday at 9 locations in Tirupati nearly 1.5 lakh tokens were distributed.
He said on all ten days SSD tokens will be issued till completion of allocated quota and TTD had made all arrangements of food and beverages both at Tirumala and Tirupati for for devotees.
He appealed to devotees to come for darshan only on given date and time slots on tokens.
TTD Board members Sri Vaidyanathan Krishnamurthy, Additional EO (FAC) Sri Veerabrahmam, Annaprasadam DyEO Sri Selvam, Special Officer Catering Sri Shastri and other officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్న ప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 1 జనవరి 2023: తిరుమల లోని పిఎసి -4 (పాత అన్నదానం కాంప్లెక్స్) లో ఆదివారం సాయంత్రం నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నప్రసాదం స్వీకరణకు వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడారు.
అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.1985 నుండి 2011 జులై 7వ తేదీ వరకు ఈ భవనంలో అన్నదానం కార్యక్రమం జరిగిందన్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో వారి సదుపాయం కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని నిర్మించామన్నారు. అన్న ప్రసాదం కేంద్రానికి భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో తిరుమలలోని నాలుగు ప్రాంతాల్లో మినీ అన్నదానం భవనాలు ప్రారంభించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పాత అన్నదానం భవనంలో తిరిగి అన్న దానం కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇక్కడ రోజుకు 15వేల మందికి అన్నదానం జరుగుతుందన్నారు. దీంతోపాటు మరో మూడు చోట్ల మినీ అన్నదానం భవనాలు ప్రారంభించి భక్తులు తాము వసతి పొందిన ప్రాంతాలకు సమీపంలోనే సులువుగా స్వామివారి అన్నప్రసాదం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.
సర్వదర్శనం టోకెన్ల గురించి….
తిరుమలలో 10రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార సర్వదర్శనం దర్శనం కోసం వచ్చేభక్తులకు తిరుపతిలోని 9ప్రాంతాల్లో ఆదివారం నుండి టోకెన్లు జారీ చేస్తున్నట్లు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ సమాధానం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు లక్షన్నర టోకెన్లు జారీ చేశారని తెలిపారు . 10 రోజుల కోటా పూర్తి అయ్యే వరకు నిరంతరంగా టోకెన్ల జారీ చేస్తామని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. భక్తులు టోకెన్లు తీసుకుని వారికి కేటాయించిన తేదీ,సమయానికే తిరుమలకు రావాలని చైర్మన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని క్యూ లైన్లలో కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వైద్యనాథన్ కృష్ణమూర్తి, అదనపు ఈవో శ్రీ వీరబ్రహ్మం, అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది