TEPPOTSAVAMS COMMENCES IN TIRUMALA _ శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Tirumala, 13 Mar. 22: After a gap of two years, the annual float festival commenced on a spectacular religious note in Tirumala on Sunday evening.

 

 

Due to Covid restrictions, this five-day annual fete was observed in Ekantam in the last two years in Swamy Pushkarini.

 

 

On the pleasant evening of Sunday, Sri Sita, Lakshmana, Anjaneya Sameta Sri Ramachandra Murty took celestial ride on the finely decked float for three rounds in Swamy Pushkarini.

 

 

The devotees were mesmerized to see the divine charm of deities on the tastefully decorated float.

 

 

HH Tirumala Pedda Jeeyar Swamy, Temple DyEO Sri Ramesh Babu and other officials were present. 

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల, 2022 మార్చి 13: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.