AKHANDA BALAKANDA PARAYANAM HELD _ రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు : ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు

TIRUMALA, 11 MARCH 2022: The seventh edition of Akhanda Balakanda Parayanam was observed in Nada Neerajanam platform at Tirumala on Sunday between 7am and 9am.

A total of 155 shlokas from chapters 27 to 32 were rendered by the Vedic scholars, faculty of all Vedic institutions related to TTD in Tirupati and Tirumala apart from National Sanskrit University under the supervision of Vedic exponents Sri Prava Ramakrishna Somayajulu, Sri Ramanujacharyulu, Sri Maruti.

Sri Somayajulu said, ‘Rama Nama Smarana’ is the best way to attain Moksha and it was proved in all the aeons.

Earlier the Parayanam commenced with Rama Keertana and concluded with Rama Bhajana.

For the sake of global devotees, TTD live telecasted the recitation on SVBC.

TTD officials also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు : ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు

బాలకాండ అఖండ పారాయ‌ణం మార్మోగిన సప్తగిరులు

తిరుమల, 2022 మార్చి 13: రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు, విజ‌యం, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం స‌మ‌కూరుతాయ‌ని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 7వ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రిగింది.

ఇందులో 27 నుండి 32 సర్గల వ‌ర‌కు గ‌ల 155 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆచార్య రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌కొన్ని వేల‌ సంవ‌త్స‌రాలుగా మాన‌వులు రామాయ‌ణం విన్న, పారాయ‌ణం చేసిన, రామనామం పలికిన బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రమును ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రాల‌ను ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది ప్ర‌జ‌లు పారాయ‌ణం చేయ‌డం వ‌ల్ల అనంతమైన ఫ‌లితం ద‌క్కుతుంద‌న్నారు.

శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ముందుగా ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వేంక‌ట‌కృష్ణ బృందం ” అల‌క ల‌ల్ల‌లాడ‌గ క‌ని “……..అనే త్యాగ‌రాజ కృతితో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ నాగ‌రాజ‌న్ బృందం చేసిన రామ‌భ‌జ‌న‌తో కార్య‌క్ర‌మం భ‌క్తి పార‌వ‌శ్యంతో ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.