TTD CHAIRMAN VISITS DHARMAGIRI VEDA PATHASHALA _ వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తనిఖీలు

Tirumala, 12 Mar. 21: TTD Chairman Sri YV Subba Reddy on Friday reiterated that none of the students of Veda Pathashala who are kept under observation in SVIMS hospital showed any symptoms of Corona and TTD is providing all Medicare to them.

The Chairman who made a spot inspection of all wings of Dharmagiri Veda Pathashala on Friday reassured parents of students that none of the students presently at the Pathashala had any Covid symptoms and that TTD is taking all precautions and effective measures to ensure health safety of all.

He interacted with faculty of the Pathashala on the reasons for the incident and later he said although 57 students and one teacher had tested Covid-19 positive, all of them are asymptomatic.

The Chairman went around the dining hall kitchens, hostel rooms and class rooms at Pathashala and directed officials to accommodate only four students in each room.

He directed the estate officer Sri Vijaysaradhi to provide more rooms in the Pathashala if necessary and also keep masks, sanitizers etc. readily available.

The Chairman also instructed Pathashala officials and faculty to observe mask wearing for all mandatory, social distancing, keep toilets and bathrooms clean and also seat students 2 meters apart in dining hall and also locate a doctor and medical staff at Dharmagiri on 24×7 basis till situation normalises.

TTD Health Officer Dr RR Reddy, Chief Medical Officer Dr Narmada, Veda Pathashala Principal Sri KSS Avadhani were present.\

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తనిఖీలు

తిరుమల 12 మార్చి 2021: తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తనిఖీలు చేశారు. కొందరు విద్యార్థులకు కోవిడ్ సోకిన నేపథ్యంలో ఆయన పాఠశాల లోని అన్ని విభాగాలు పరిశీలించారు.

– విద్యార్థులు కరోనా బారిన పడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

– 57 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడికి కోవిడ్ సోకిందని,ఎవరికీ లక్షణాలు కనిపించలేదని అధికారులు చైర్మన్ కు తెలిపారు.

– వేద పాఠశాలలోని భోజనశాలలు, వంటశాల, విద్యార్థుల వసతి గృహాలు, తరగతి గదులు చైర్మన్ పరిశీలించారు.

– ఒక గదిలో నలుగురు విద్యార్థులకు మాత్రమే వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

– కోవిడ్ 19 నిబంధనల మేరకు విద్యార్థులు,అధ్యాపకులకు వసతి కల్పించడానికి అవసరమైతే అదనపు గదులు కేటాయించాలని ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ విజయ సారథిని శ్రీ సుబ్బారెడ్డి ఆదేశించారు.

– విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు.

– విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు.

-. నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, స్నానాల గదులు తరచూ శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

– డైనింగ్ హాల్ లో 2 మీటర్ల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టాలన్నారు.

– పరిస్థితులు మామూలు స్థాయికి వచ్చే దాకా డాక్టర్, వైద్య సిబ్బందిని రేయింబవళ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, వేద పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని పాల్గొన్నారు.

ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : చైర్మన్

వేద పాఠశాలలో కోవిడ్ సోకిన విద్యార్థులందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. వీరందరికీ మెరుగైన చికిత్స జరుగుతోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది