WORLD CLASS STATE OF ART CHILDRENS HOSPITAL AT TIRUPATI SOON ON DONATION BASIS- TTD CHAIRMAN _ దాత‌ల స‌హాకారంతో తిరుపతిలో అత్యాధునిక‌ ప్రమాణాలతో చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ‌హాస్పిటల్ :‌‌ టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirumala, 12 Mar. 21: TTD is planning to establish a State of the Art Paediatric Super Speciality Hospital in collaboration with Mumbai based Udveg Infrastructure and Consultancy Pvt Ltd. (UIC) who has come forward to take up the project on donation basis.

TTD EO Dr KS Jawahar Reddy and UIC CEO and MD Sri Sanjay K Singh inked the landmark MoU in the presence of TTD Chairman Sri YV Subba Reddy to set up the state of art paediatric hospital in the pilgrim city of Tirupati.

Speaking on the occasion at Annamaiah Bhavan in Tirumala, the TTD Chairman said the venture was part of AP CM Sri YS Jaganmohan Reddy’s vision after bifurcation of united AP to set up super speciality Children’s’ Hospitals at Tirupati, Vijayawada and Visakhapatnam which led to TTD board resolve for same.

TTD EO said the TTD will soon conduct Bhumi puja for the new children’s hospital which will be part of SVIMS super speciality and the UIC apart from bearing the entire construction cost of Rs.300crore, will take up the operational management also for a few years. 

The UIC CEO and MD Sri Sanjay Singh said it was a great privilege to collaborate with world renowned Hindu religious organization like TTD and commence a noble project meant for health care of children at the lotus feet of Sri Venkateswara.

Additional EO Sri AV Dharma Reddy, TTD FA&CAO Sri O Balaji, CE Sri Ramesh Reddy, SVIMS Director Dr Vengamma, CMO Dr Narmada and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దాత‌ల స‌హాకారంతో తిరుపతిలో అత్యాధునిక‌ ప్రమాణాలతో చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ‌హాస్పిటల్ :‌‌ టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2021 మార్చి 12: ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అత్యాధునిక‌ ప్రమాణాలతో ముంబాయికి చెందిన దాత ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్టెక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) ఆధ్వ‌ర్యంలో రూ.300 కోట్ల‌తో చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ‌హాస్పిటల్ నిర్మించనుందని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బ‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్రవారం ఉదయం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, యు.ఐ.సి.సంస్థ సిఈవో మ‌రియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సంజ‌య్ కె. సింగ్‌‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బ‌రెడ్డి స‌మ‌క్షంలో ‌సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న అనంర‌తం ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యేకంగా చిన్న పిల్ల‌లకు ఉన్న‌త‌ వైద్య సేవ‌లు అందించేందుకు తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంల‌లో చిన్న పిల్లల ఆసుప‌త్రులు నిర్మించాల‌ని రాష్ట్ర ముఖ్య‌‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సంక‌ల్పించిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌‌మంత్రి ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి పాదాల చెంత తొలిసారి‌గా తిరుప‌తిలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింద‌న్నారు.

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ముంబాయికి చెందిన యు.ఐ.సి. సంస్థ అధినేత రూ.300 కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆసుప‌త్రి ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం యు.ఐ.సి. సంస్థ, టిటిడితో ఎమ్‌వోయు కుదుర్చుకున్న‌ట్లు వివ‌రించారు.

అనంత‌రం ఈవో మాట్లాడుతూ ఇప్ప‌టికే విద్య‌, వైద్య రంగాల‌లో టిటిడి విశేష సేవ‌లు అందిస్తున్న‌ద‌న్నారు. తిరుప‌తిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయ‌నున్న చిన్న పిల్ల‌ల ఆసుప‌‌త్రి స్వీమ్స్‌కు అనుబంధంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. దాత శ్రీ సంజ‌య్‌ సింగ్‌ ఆసుప‌త్రి నిర్మాణంతో పాటు కొన్ని సంవ‌త్స‌రాల పాటు నిర్వ‌హ‌ణ భాధ్య‌త‌లు కూడా చూసుకోనున్న‌ట్లు వివ‌రించారు. త్వ‌ర‌లో ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్వేగ్‌‌ ఇన్‌ఫ్రాస్టెక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్‌ సిఈవో మ‌రియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సంజ‌య్ కె. సింగ్‌‌‌ మాట్లాడుతూ తిరుపతిలో చిన్న పిల్ల‌ల‌ ఆస్పత్రి నిర్మించేందుకు శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత హైంద‌వ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్ల‌ల‌కు వైద్య సేవలందించేందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకారం అందించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్వీమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ, టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సీఏవో శ్రీ బాలాజీ, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, డిఎల్‌వో శ్రీ రెడ్డ‌ప్ప‌రెడ్డి, సిఎమ్‌వో డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.