PHALGUNA MASA UTSAVAMS FROM MARCH 14 _ మార్చి 14 నుండి ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

Tirumala, 12 Mar. 21: On the lines of Utsavas of Karthika, Dhanur and Magha months, TTD is now set for organising Phalguna month Utsavams from March 14 under the aegis of SVBC.

Following are the details of festivals.

March 14: Month long Sri Lakshmi Vaibhavam pravachanam at Nada Neeranjanam platform from March 14 between 6am and 6:40am.

March 19: Sri Mrulingarchana on Shudha Shasti day at Dhyanaramam in SV Vedic University between 8am and 9am.

March 24: On Shukla Ekadasi day Amaalaki Ekadasi at Dhatri Vanam of SV Vedic University will be observed between 9am and 10am.

March 28: Phalguna Shudda Pournami day Lakshmi Jayati at Vijayawada will be observed between 8.30pm-10pm.

On April 4 on Phalguna Bahulastami day Sheetalastami (Sheetala Devi archanam) at Dhyanaramam of SV Vedic University will be observed between 10am and 11am.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 14 నుండి ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

తిరుమ‌ల‌‌, 2021 మార్చి 12: హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో మార్చి 14వ తేదీ నుండి ఫాల్గుణ మాస ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇదివ‌ర‌కు నిర్వ‌హించిన కార్తీక‌, ధ‌నుర్‌, మాఘ మాస ఉత్స‌వాల‌కు భ‌క్తుల నుండి విశేషాద‌ర‌ణ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఫాల్గుణ మాస ఉత్స‌వాల వివ‌రాలిలా ఉన్నాయి.

– మార్చి 14 నుండి నెల రోజుల పాటు ప్ర‌తి రోజూ ఉద‌యం 6 నుండి 6.40 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఫాల్గుణ మాసం – ల‌క్ష్మీ వైభ‌వం పేరిట ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

– మార్చి 19న ఫాల్గుణ శుద్ధ ష‌ష్ఠినాడు తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలోని ధ్యానారామంలో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు మృల్లింగార్చ‌న చేప‌డ‌తారు.

– మార్చి 24న ఫాల్గుణ శుద్ధ ఏకాద‌శి నాడు తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలోని ధాత్రీవ‌నంలో ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆమ‌లకీ ఏకాద‌శి నిర్వ‌హిస్తారు.

– మార్చి 28న ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు విజ‌య‌వాడ‌లో రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష్మీ జ‌యంతి చేప‌డ‌తారు.

– ఏప్రిల్ 4న ఫాల్గుణ బ‌హుళాష్ట‌మి నాడు తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలోని ధ్యానారామంలో ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శీత‌లాష్ట‌మి(శీత‌లాదేవ్య‌ర్చ‌నం) నిర్వ‌హిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.