TTD PROCURES MELCHAT VASTRAM FROM SALEM-ADDNL.EO _ సేలం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రాల కొనుగోలు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 05 May 20:TTD has procured eight Melchat Vastram for Lord Venkateswara from Salem which will last till June, said TTD Additional EO Sri AV Dharma Reddy.

Speaking to the media at Tirumala on Tuesday he said, the Melchat Vastram are procured through a tender process from the lowest bidder in Salem. These sarees are specially prepared to be adorned to Lord Venkateswara moola Virat with specific length and breadth. The weavers prepare these silk vastrams with utmost devotion. 

In the wake of existing COVID 19 restrictions across the country, it has become difficult for us to transport these Vastrams from Salem. So we requested our Board Member Sri Sekhar Reddy who negotiated with Tamil Nadu Chief Secretary and DGP and brought the vastrams to Tirumala today”,  he added.

It may be mentioned here that the Vastralankara Seva is performed on every Friday in Tirumala temple as a weekly special seva immediately after the completion of the Abhisheka Seva. 

Usually the devotees purchase tickets under current booking at CRO in an electronic lucky dip for the Seva.

But in view of COVID 19 lockdown restrictions which are in vogue in Tirumala since March 20, TTD has closed down darshan for pilgrims. As a result, at present TTD is left with only two Melchat Vastram. So TTD procured eight such vastrams through a tender process from the lowest bidder from Salem.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సేలం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రాల కొనుగోలు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2020 మే 05: తిరుమ‌ల శ్రీ‌వారికి అలంక‌రించేందుకు 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాలను సేలం నుండి కొనుగోలు చేశామ‌ని, జూన్ నెల వ‌ర‌కు ఇవి స‌రిపోతాయ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

తిరుమ‌ల‌లో మంగ‌ళ‌వారం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ టెండ‌ర్‌లో త‌క్కువ కోట్ చేసిన సేలంలోని త‌యారీదారుల నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రాలు కొనుగోలు చేసిన‌ట్టు తెలిపారు. స్వామివారి మూల‌మూర్తికి అలంక‌రించేందుకు ప్ర‌త్యేక కొల‌త‌ల‌తో ఈ చీర‌ను త‌యారుచేస్తార‌ని చెప్పారు. సేలంలో మాత్ర‌మే మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను త‌యారుచేస్తార‌ని, త‌యారీదారులు ఎంతో నియ‌మనిష్ట‌ల‌తో ఈ ప‌ట్టువ‌స్త్రాన్ని రూపొందిస్తార‌ని తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉండ‌డంతో సేలంలో సిద్ధమైన 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం క‌ష్టంగా మారింద‌ని,  టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి చొర‌వ తీసుకుని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిజిపి అనుమ‌తులు తీసుకుని సేలం నుండి ఈ వ‌స్త్రాల‌ను తిరుమ‌ల‌కు తీసుకొచ్చార‌ని అద‌న‌పు ఈవో తెలిపారు.

కోవిడ్ -19 వ్యాప్తిని నివారించేందుకు మార్చి 20వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా ప్ర‌స్తుతం 2 మేల్‌ఛాట్ వ‌స్త్రాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ క్ర‌మంలో టెండ‌రు ద్వారా 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను టిటిడి కొనుగోలు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.