ANKURARPANAM FOR VASANTHOTSAVAM PERFORMED _ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

TTD TO PERFORM IN EKANTAM IN VIEW OF COVID 19 RESTRICTIONS 

Tiruchanoor, 05 May 20; The Ankurarpanam fete for the annual three day Vasanthotsavams was observed in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Tuesday. 

However in view of ongoing measures by TTD to restrict the spread of CoronaVirus (COVID 19),  the festival will be observed in Ekantam without permitting devotees from May 6-8. 

Everyday there will be Snapana Tirumanjanam to the processional deity of Sri Padmavathi Ammavaru between 2:30pm and 4:30pm.

The procession of Ammavaru will take place between 7pm and 7:30pm inside the temple itself. 

TTD has cancelled Kalyanotsavam and Sahasra Deepalankara Sevas from May 5 to 8, Ashtottara Sata Kalasabhishekam on May 6, Tiruppavada Seva on May 7 and Lakshmipuja on May 8.

On Tuesday evening temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and other staff members were present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    



శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌
 
తిరుపతి, 2020 మే 05: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జరిగింది.
 
ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సాయంత్రం పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నంతోపాటు అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ విష్వ‌క్సేనుల‌వారిని ఆల‌య ప్రాంగణంలో ఊరేగింపు చేప‌ట్టారు.
 
ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు. 
 
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.