TTD TO PROMOTE OLD AGE HOMES IN AP AND TS- TTD CHAIRMAN _ టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు

Tirupati, 27 Dec. 20: TTD is mulling over to promote Old Age Homes and Leprosy Hospitals in the twin Telugu states of Andhra Pradesh and Telangana.

TTD Chairman Sri YV Subba Reddy directed the officials to prepare feasibility reports for setting up such units in both states.

Earlier the TTD Chairman visited the old age home and leprosy hospital at Tirupati on Sunday and directed officials to take up repairs to leaking roofs, repaint some rooms and also improve quality of medical and food services to aged inmates.

TTD Chief Medical Officer Dr Narmada explained that there were presently 32 persons in old age homes and 56 patients in leprosy hospital. The Chairman instructed the officials to use vacant buildings available at Tirupati for setting up old age homes and that TTD will amend eligibility criteria to enable admission to more persons.

He also directed officials to enhance the strength of medical staff at the PHCs on Srivari Mettu and Alipiri footpath routes and to work in two shifts and also enable PHC services for devotees in the Annamaiah Margam on Important days.

Leprosy hospital In-charge Dr Bharat Kumar, HDPP Advisory Committee Cooption member Sri Penchalaiah and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు
 
–  పూర్ హోం, లెప్రసి ఆసుపత్రుల అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోండి
 
–  అధికారులకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశం
 
తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 27: టీటీడీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని  టీటీడీ లెప్రసీ ఆసుపత్రి, వృద్ధాశ్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు.
 
వృద్ధాశ్రమంలో 32 మంది, లెప్రసి హోం లో 56 మంది ఉన్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద వివరించారు. శ్రీ సుబ్బారెడ్డి వీరందరితో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, భోజనం, ఇతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. మంచి సేవలు అందుతున్నాయని వారు చెప్పారు. ఆసుపత్రిలో పైకప్పు  నుంచి నీరు లీక్ అవుతుండటం చూసి దాన్ని వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం లెప్రసీ వ్యాధి గ్రస్థుల కోసం ఉపయోగిస్తున్న  బ్లాక్ ను మరమ్మత్తులు చేయించి, రంగులు వేయించాలని చెప్పారు. మిగిలిన భవనాలను కూడా అభివృద్ధి చేసి వృద్ధాశ్రమానికి వాడుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితే ప్రాతిపదికన అర్హులైన వృద్ధులను చేర్చుకోవడానికి అవసరమైతే నిబంధనలు సవరిస్తామని చైర్మన్ అధికారులకు చెప్పారు. ఖాళీగా ఉన్న భవనాలు ఉపయోగంలోకి తేవాలన్నారు.
 
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల వద్ద సిబ్బందిని రెండు షిఫ్ట్ లుగా విధులకు నియమించాలన్నారు. అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించు కోవడానికి ప్రతిపాదనలు పంపితే అనుమతి మంజూరు చేస్తామన్నారు. అన్నమయ్య మార్గం లో కూడా భక్తులు ఎక్కువగా నడచి వచ్చే రోజుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
         
లెప్రసీ ఆసుపత్రి డాక్టర్ భరత్ కుమార్, హెచ్ డిపిపి సలహామండలి కో ఆప్షన్ సభ్యులు శ్రీ పి.పెంచలయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది