TTD CHAIRMAN VISITS TEMPLES AROUND TIRUPATI _ వకులమాత, కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

Tirupati, 27 Dec. 20: TTD Chairman Sri YV Subba Reddy on Sunday visited the temples of Sri Vakulamata at Perur Banda and

Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram.

The Chairman inspected the gold lacing works underway at Sri Vakola Mata temple taken up under AP minister Sri Peddireddy Ramachandra Reddy.

At the Sri Kalyana Venkateswara temple the DyEO Smt Shanti informed the Chairman that 39,000 devotees had Vaikunta Dwara Darshan on Vaikunta Ekadasi day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

వకులమాత, కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
 
తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 27: పేరూరు బండ మీద రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మిస్తున్న వకులమాత ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.
 
వకులమాత ఆలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పనులు చేస్తున్న స్థానికులతో శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడి ఆలయం  పూర్వా పరాలు తెలుసుకున్నారు. ఆలయ గోపురానికి జరుగుతున్న బంగారు మలాం పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన శ్రీ వకులమాతను దర్శించుకున్నారు.
 
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన చైర్మన్ కు డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశికి ఆలయంలో చేసిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఏకాదశి రోజు 39 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని డిప్యూటి ఈవో చైర్మన్ కు చెప్పారు. మార్చిలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని డిప్యూటి ఈవో ఆహ్వానించగా,  తప్పకుండా వస్తానని చైర్మన్ తెలిపారు. అనంతరం ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు తీర్థ, ప్రసాదాలు అందించారు. తరువాత శ్రీ సుబ్బారెడ్డి ఆలయంలో భక్తులతో మాట్లాడారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.