VAHANA SEVAS CONCLUDES WITH ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUPATI, 07 DECEMBER 2021: The different vahana sevas which allured devotees for during the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor, culminated with Aswa Vahanam on Tuesday evening.

 

On the eighth day evening, Sri Padmavathi decked in Kalki Avatara seated majestically on Aswa Vahanam at Vahana Mandapam to bless Her devotees.

 

Both the senior and junior Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Smt Kasturi Bai and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2021 డిసెంబరు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి  అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ అశ్వం సాక్షి గా నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఎవిఎస్వో శ్రీ సాయిగిరిధర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.