SAMPOORNA BHAGAVAT GITA SHLOKA PARAYANAM AT TIRUMALA _ డిసెంబ‌రు 14న తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 08 DECEMBER 2021: In connection with Gita Jayanthi on December 14, Sampoorna Bhagavatgita Shloka Parayanam will be organized by TTD at Nada Neerajanam platform in Tirumala.

Additional EO Sri AV Dharma Reddy conducted a review meeting with all the officials concerned and Pundits over the arrangements to be made for the event.

He directed that the stage should be prepared with attractive diaromas matching the occasion. He said the program will be telecasted live on SVBC between 7am and 12noon on December 14.

The Gita Parayanam was commenced by TTD during last September with scholars, Sri Kuppa Vishwanatha Shastri giving narration while shloka rendition by Sri Kasipathi. The programme has been receiving a humongous response globally from devotees over the past one year.

Last year also TTD had organized Sampurna Gita Parayanam on December 25 on Gita Jayanthi. While this year, it will be observed on December 14.

Vice-Chancellor SV Vedic University Sri Sannidhanam Sudarshana Sharma, CEO SVBC Sri Suresh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, DyEO Sri Ramesh Babu, Garden Deputy Director Sri Srinivasulu, Scholars Sri Kuppa Vishwanatha Shastri, Sri Kasipathi, Annamacharya Project Director Dr A Vibhishana Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 14న తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 07: డిసెంబ‌రు 14న గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకొని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం అద‌న‌పు ఈవో అధికారుల‌తో గీతా జ‌యంతి ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ డిసెంబ‌రు 14న ఉద‌యం 7 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఐదు గంట‌ల పాటు భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంత‌రాయంగా పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ శ్లోకాల‌ను శ్రీ కాశీప‌తి పారాయ‌ణం చేయ‌గా, శ్రీ కుప్పా విశ్వ‌నాధ శాస్త్రీ వ్యాఖ్యానం చేస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొంటున్నందున అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

టిటిడి ప్ర‌సారం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తొంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో గీతా పారాయ‌ణం సింహ‌భాగంలో ఉన్న‌ట్లు, ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల‌ది మంది భ‌క్తులు భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం వీక్షించి, మ‌ళ్ళీ, మ‌ళ్ళీ ప్ర‌సారం చేయ‌మ‌ని కోరుతున్నార‌న్నారు.

ఈ స‌మావేశంలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ, సిఇవో శ్రీ సురేష్ కుమార్‌, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీ‌దేవి, డిఇ (ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ ర‌విశంక‌ర్ రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా.ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌, శ్రీ కుప్పా విశ్వ‌నాధ శాస్త్రీ, శ్రీ కాశీప‌తి, ఇత‌ర పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.