VANABHOJANAM HELD _ శ్రీవారి మెట్టు వద్ద కార్తీక వనభోజనం

TIRUPATI, 21 NOVEMBER 2022: Vanabhojanam was held at Srivari Mettu near Srinivasa Mangapuram on Monday.

 

Usually, this fete is observed in the holy month of Karthika every year where community dining is being arranged by TTD in Paruveta Mandapam.

 

Earlier during the day, the processional deities were brought to the mandapam and Snapana Tirumanjanam was performed by Archakas. Later Karthika Vanabhojanam was held between 1pm and 3pm.

 

Devotees participated in large numbers and Annamacharya Project artists rendered keertans on the occasion.

 

TTD Board member Sri Ashok Kumar, Spl Gr DyEO Smt Varalakshmi and others were present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి మెట్టు వద్ద  కార్తీక వనభోజనం
 
తిరుపతి, 2022 నవంబరు 21: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా  సోమవారం శ్రీవారి మెట్టు వద్ద గల పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. 
 
ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.  అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం జరిగింది. 
 
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
         
ఈ కార్యక్రమంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్,  డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి శాంతి, శ్రీమతి పార్వతి, ఏఈఓ శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చంగల్ రాయలు,  ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.