DEVOTIONAL CULTURAL FEAST FOR BRAHMOTSAVAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

TIRUPATI, 21 NOVEMBER 2022: TTD has organised devotional cultural programmes at different venues in connection with the ongoing Karthika Barhmotsavams at Tiruchanoor.

 

On Monday, the Mangaladhwani in Nadaswaram, Sankeertans, Veda Parayanam, religious discourse, Harikatha Parayanam etc. at Tiruchanoor Astana Mandapam, Urban Haat, Mahati Auditorium, Ramachandra Pushkarini by various artistes attracted the art lovers.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2022 న‌వంబ‌రు 21: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి లక్ష్మీ సువర్ణ, శ్రీ నాగరాజు బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు భద్రాచలం కు చెందిన శ్రీ స్థల సాయి ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సేలం చెందిన మెట్టూరు బ్రదర్స్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి విజయ కుమారి భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి చెన్నైకి చెందిన లలితా మాధవ్ బృందం భక్తి సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి బెంగళూరుకు చెందిన శ్రీమతి ఆపేక్ష బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద తిరుప‌తికి చెందిన శ్రీ రాజేష్ కుమార్, శ్రీమతి విజయలక్ష్మి బృందంచే భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు బృందగానం జరిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.