COLOURFUL FLOWER DECORATIONS ENTHRALLED DEVOTEES _ సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

  • భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ

తిరుపతి,2022 న‌వంబ‌రు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన సోమవారం అమ్మవారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.

కంకణభట్టర్‌ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఏడు ర‌కాల మాల‌లు

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. పిస్తా, ఎండు ద్రాక్ష, కలింకాయ, పసుపు ధారాలు, తామ‌ర‌పూల గింజ‌లు, రంగురాళ్ల‌తో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు.

ఆకట్టుకున్న ఫల పుష్ప మండపం

స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపాన్ని వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన పుష్పాలు, ఆపిల్‌, జామ‌, ద్రాక్ష‌, మొక్కజొన్న, గ్రీన్ యాపిల్, ఆస్ట్రేలియా ఆరంజ్ త‌దిత‌ర ఫ‌లాల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్‌ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి రూపొందించారు.

భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 70 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 21 November 2022: On the second day of the ongoing annual Karthika Brahmotsavam at Sri Padmavati temple in Tiruchanoor, TTD organised an awe-inspiring Snapana Tirumanjanam on Monday.

The divine ceremony was held at the Sri Krishna Swami Mukha  Mandapam as per Pancharatra Agama traditions in the afternoon between 12:30pm and 2:30pm under the supervision of Kankanabhattar Sri Manikanta Swamy.

The holy function of Snapana Tirumanjanam was performed after basic rituals of Pancharatra Agama traditions which included Shankadhara, Chakradhara, Sahasradhara and Maha Kumbhabisekam.

SEVEN VARIETIES OF GARLANDS

As Archakas chanted Taittireya Upanishads, Purusha Suktam and Sri Prashna Samhita Mantra,  seven varieties of garlands made of dried raisin, pista, yellow threads, seeds of lotus flowers, colourful stones and roses.

ATTRACTIVE CANOPY OF FRUITS AND FLOWERS

In Sri Krishna Mandapam where Snapana Tirumanjanam was performed was richly decorated with colourful traditional flowers, cut flowers and rare flowers besides apples, grapes, green apples, Australian oranges etc. Twenty garden staff had worked hard for two days to decorate the canopy of flowers and fruits at the Mukha Mandapam. 

DEVOTEES ENTHRALLED BY FLOWERS DECORATIONS

The attractive flower decorations at Dwaja Mandapam, sanctum of Sri Padmavati temple, Sri Krishna Swami temple, Sri Sundararaja Swami temple and Asthana Mandapam was a cynosure of devotees.

Nearly 70 members of TTD garden department strived for seven days to put up a beautiful canopy and flower decor for the Brahmotsavam.

DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, temple Archakas and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI