VASANTHOTSAVAM CONCLUDES_ వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tiruchanoor, 30 April 2018: The three-day annual Vasanthotsavams concluded on a religious note on Monday in Sri Padmavathi Ammavari temple.

On the final day also, after the morning rituals, the processional deity of Goddess Padmavathi Devi was brought to Friday Gardens and Snapana Tirumanjanam was performed between 3pm and 4.30pm.

Later in the evening Veedhi Utsavam was also performed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

ఏప్రిల్‌ 30, తిరుపతి 2018: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి.

చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఆలయ ఎఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.