AP CM OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

Tirumala, 30 April 2018: The Honourable CM of AP Sri N Chandra Babu Naidu offered prayers in the temple of Lord Venkateswara at Tirumala on Monday evening.

The CM entered the temple through Vaikuntham queue complex and at Mahadwaram he was received by TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav and TTD EO Sri Anil Kumar Singhal.

After darshan of Lord Venkateswara, he was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam. TTD chairman and EO offered him teertha prasadams. Board member Sri Challa Ramachandra Reddy, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO In-charge Sri Siva Kumar Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

ఏప్రిల్‌  30,  తిరుమల 2018: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా గౌ|| ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్దకు చేరుకోగానే టిటిడి  ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలిసి స్వాగతం పలికారు. 

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌, ఈవో కలిసి గౌ|| ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.