VASANTHOTSAVAM HELD IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

TIRUPATI, 24 NOVEMBER 2022: After a series of hectic activities for the last five days, as part of the ongoing annual brahmotsavams in Tiruchanoor, Vasanthotsavam also known as Shrmapariharotsavam or Upasamanotsavam was observed on Thursday evening between 3pm to 5pm to Goddess Sri Padmavathi Devi.

 

The processional deity was paraded all along the four mada streets sprinkling the sandal paste which was sprinkled by the archakas on devotees.

 

Deputy EO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

తిరుపతి, 2022 నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.