VASANTHOTSAVAMS CONCLUDES _ తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tiruchanoor, 8 May 2020: The annual three day Vasanthotsavams concluded in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Friday. 

The processional deity of Ammavaru was given celestial Snapana Tirumanjanam in Asirvachana Mandapam. 

In the evening procession on Tiruchi was also held within temple premises.

Temple DyEO Smt Jhansi Rani, Superintendent Smt Malleswari and other temple staff participated. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
 
తిరుపతి, 2020 మే 08: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.
 
వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు.  ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.