ANNAMAIAH SANKEERTANS SPREAD SRIVARI VAIBHAVAM ACROSS THE WORLD- ADDITIONAL EO _ అన్న‌మ‌య్య ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభవం విశ్వ‌వ్యాప్తం – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 8 May 2020: The 32 thousand odd sankeertans penned by Saint Poet Sri Tallapaka Annamacharya have spread the glories of Lord Venkateswara across the globe said,  TTD Additional EO Sri AV Dharma Reddy.  

He was participating in the 29th day of Yogavashista – Sri Dhanwantari Maha Mantra Parayanam conducted by the Dharmagiri Veda Vijnana Peetham at the Nada Neerajanam Mandapam in Tirumala on Friday morning.

On the occasion of 612th Birth Anniversary of the Telugu Padakavita Pitamaha Sri Annamacharya, the Additional EO said Annamaiah born with Srivari blessings had digested all Veda shastras with the benign blessings of Ahobilam Lakshmi Narasimha. He imbibed the essence of Vedas in simple language to reach common folk also and with unstinted devotion penned 32,000 sankeertans.

Sri Venkateshwarlu, Harikatha lecturer of SV College of Music and Dance presented a melodious Annamaiah sankeertan depicting the Dasavatara Vaisishtyam of Lord through the famous kriti “Hari Nee Pratapamuna Kaddamedi Lokamuna..Sari leku neekevaru Sarveshvara..”

Dharmagiri Veda Vijnana Peetham Principal Sri KSS Avadhani later explained and recited the mystic virus removal mantras embedded in the 69th section of the Yoga Vasishtyam conceived by Sri Valmiki Maharshi in the Ramayana.

Besides, Sri Dhanvanthri Maha Mantra, Sri Lakshmi Devi Mantra and Navagraha Prarthana Mantras were also recited as well.

DyEOs Sri Balaji, Sri Damodar, Sri Venkataiah, Health officer Dr RR Reddy, media representatives and other officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అన్న‌మ‌య్య  ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభవం విశ్వ‌వ్యాప్తం  – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2020 మే 08: పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమ‌య్య త‌న ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేశార‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణంలో భాగంగా 29వ రోజైన‌ శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న పాల్గొన్నారు.

అన్న‌మ‌య్య 612వ జ‌యంతి సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి అనుగ్ర‌హంతో అన్న‌మ‌‌య్య  జ‌న్మించిన‌ట్లు, అహోబిలం శ్రీ ఉగ్రనరసింహస్వామివారి అశీస్సుల‌తో స‌ర్వ శాస్త్రాలను అభ్య‌సించిన‌ట్లు వివ‌రించారు. శ్రీ‌వారిపై ఉన్న అచంచ‌ల భ‌క్తితో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు హ‌రి నీ ప్ర‌తాప‌మున క‌డ్డ‌మేది లోక‌మున …స‌రి యేరి నీకు మ‌రి స‌ర్వేశ్వ‌ర …అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ను ఆల‌పించారు. ఈ కీర్త‌న‌లోని శ్రీమ‌హావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొ అవ‌తారంలో దుష్ట శిక్ష‌ణ – శిష్ట ర‌క్ష‌ణ‌ను చేప‌ట్టిన విధానాన్ని,  ద‌శావ‌తారాల ప్రాశ‌స్త్యాన్ని అద‌న‌పు ఈవో వివ‌రించారు.

అనంత‌రం క‌రోనా వ్యాధి వ్యాప్తి అరిక‌ట్టాల‌ని స్వామివారిని కోరుకుంటూ గ‌త ఏప్రిల్ 10వ తేదీ నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రాయంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ఈ వేదమంత్రాల‌ను ప‌ఠించి వ్యాధుల నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. అంత‌కుముందు ఆయ‌న శ్రీ‌వారి ఆల‌యంలో అర్చ‌కులు ఏకాంతంగా నిర్వ‌హించే కైంక‌ర్యాల‌ను వివ‌రించారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో శ్రీ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణం గ్రంథంలోని యోగ‌వాశిస్టంలో శ్రీ‌రామ, వ‌శిష్ట సంవాదరూపమైన ఉత్ప‌త్తి ప్ర‌క‌ర‌ణంలో 69వ స‌ర్గ‌లో విషూచికా(సూక్ష్మ‌క్రిమి) నివార‌ణ మంత్రాల‌ను ప‌ఠించారు. ఈ మంత్రంతోపాటు మాన‌వాళికి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ ధ‌న్వంత‌రి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం, మాంగళ్య‌ వృద్ధిని కోరుతూ ల‌క్ష్మీ దేవి మంత్ర పారాయ‌ణం, న‌వ‌‌గ్రహ ప్రార్థ‌న‌ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి,  శ్రీ దామోద‌రం, శ్రీ వెంక‌ట‌య్య, ‌ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, మీడియా ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.