VONTIMITTA RAMACHANDRA GRACES IN MOHINI ALANKARA _ మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

Vontimitta, 25 Apr. 21Lord Sri Ramachandra in Mohini alankaram graced the devotees held in ekantham on the fifth day, Sunday morning of the ongoing Brahmotsavam at the ancient Sri Kodandaramaswamy temple.

Mohini avatara is symbolic of Lord’s mystic powers to rule over evil with his mesmerising looks as Universal Damsel.

After morning vahana seva the utsava idols of Swamy and His consorts were rendered traditional Snapana thirumanjanam.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Temple Inspector Sri Dhananjeyulu and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 25: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌కు మోహినీ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేయ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది