DRESSED AS “COWHERD” MALAYAPPA RIDES KALPAVRUKSHA VAHANAM _ క‌ల్ప‌వృక్ష వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

Tirumala, 22 Sep. 20: With the traditional headgear, stick and flute Sri Malayappa Swamy blessed devotees on His in “Govula Gopanna” attire on the Kalpavruksa vahanam on the day four of the ongoing annual Brahmotsavams on Tuesday.

Flanked by His two consorts Sridevi and Bhudevi, Lord Malayappa graced on the Kalpavruksha Vahanam-the divine wish-fulfilling tree.

Legends says that Kalpavruksha was one of the elements that erupted during Samudra Madanam – the famous episode of Srimad Bhagavatam, the churning of the milky ocean using the serpent King Adisesha as a rope with Mandara Mountain as Chruner to extract Amritam-the holy nectar.

Those who took shelter under Kalpavruksha will not have problems of starvation and poverty. The use of Kalpavruksha vahanam by Lord Venkateswara also denotes the importance given to environment, greenery and promotion of forests with the pollution-free atmosphere. Lord Venkateswara who Himself is a ‘Kalpavriksha’ blesses every devotee with boons sought by them. 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami, Sri Sri Sri Chinna Jeeyarswami, TTD trust board chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Board members Sri DP Ananta, Sri Shiv Kumar, Sri Shekar Reddy, Sri Govind Hari, Additional EO Sri A V Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Dyeo of Srivari temple Sri Harindranath, Peshkar Sri Jaganmohanacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

క‌ల్ప‌వృక్ష వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

తిరుమల, 2020 సెప్టెంబరు 22: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా దర్శనమిచ్చారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.