SRIVILLIPUTTUR GARLANDS REACHES TIRUMALA _ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

Tirumala, 22 Sep. 20: The sacred garlands from Srivilliputtur of Tamilnadu reached Tirumala on Tuesday evening. 

Speaking on this occasion, the TTD Trust Board Chairman Sri YV Subba Reddy said, it has been a customary practice to receive the garlands from Srivilliputtur on the day before Garuda Seva. 

These holy floral garlands popularly known as Goda Devi malas from made of Tulasi, Chamanti and Sampangi flowers reached Tirumala which will be decked to the presiding deity of Lord Venkateswara on Garuda Seva day on Wednesday. 

The two garlands also known as Andal mala and Shikamani malas kept in big baskets were offered by two families of flower makers of Srivalliputhur, 650 kms from Tirupati. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 22: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగ‌ళ‌వారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అక్కడినుంచి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

అంతకుముందు ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీ ధ‌న‌పాల్ ర‌విచంద్ర‌, ఈవో శ్రీ ఇలంగోవ‌న్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.